'మహానాయకుడు'లో ఏముంటుందో తెలిసిపోయింది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో వర్మ ఏం చూపిస్తాడో ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. ముందుగా 'ఎన్టీఆర్ మహానాయకుడు' విడుదలవుతోంది. ఆ తర్వాతే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సంగతి. స్వర్గీయ నందమూరి తారకరామారావు రాజకీయ జీవితం 'మహానాయకుడు'లా కనిపించబోతోంది. దర్శకుడు క్రిష్ సినిమాని బాగానే తెరకెక్కించి ఉంటాడు. ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్‌లో మొదటి పార్ట్ అయిన 'కథానాయకుడు'కి మంచి రివ్యూలే దక్కాయి.
క్రిష్ బాగానే తెరకెక్కించినా, ఎందుకో 'కథానాయకుడు' అంచనాల్ని అందుకోలేకపోయింది. 'మహానాయకుడు'తో క్రిష్ ఏం చేశాడనేది ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది. అయితే ముఖ్యమైన ఘట్టం 'వెన్నుపోటు'ను పూర్తిగా కనిపించనీయకుండా జాగ్రత్త పడినట్లున్నారు. ఆ పార్ట్ ఎలాగూ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో కనిపిస్తుంది. సో 'ఎన్టీఆర్ బయోపిక్' రెండు పార్ట్‌లకు క్రిష్ దర్శకత్వం వహిస్తే, మూడో పార్ట్‌కి వర్మ దర్శకత్వం వహించాడని సరిపెట్టుకోవాలి.
ఇప్పుడున్న పరిస్థితిని బట్టి క్రిష్ మీద రామ్‌గోపాల్ వర్మ పై చేయి సాధించాడని ఒప్పుకోక తప్పదు. 'మహానాయకుడు' మీద కన్నా, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మీదనే అందరిలోనూ ఆశక్తి ఉంది. 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాకి రివ్యూలు బాగానే రావొచ్చేమో. ఓపెనింగ్స్ మాత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కే ఉంటాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.