క్రిష్ తెరకెక్కిస్తున్న 'ఎన్టీఆర్ మహానాయకుడు'లో చంద్రబాబు పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రోమోస్‌లో రానా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. మరోవైపు 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో చంద్రబాబు పాత్ర పోషిస్తున్న నటుడు శ్రీతేజ మాత్రం చూపులతోనే క్యారెక్టర్ బిల్డప్‌ని చెప్పేస్తున్నాడు. రానా వెర్సస్ శ్రీ తేజ అనుకుంటే, ఆ పాత్రకు శ్రీ తేజకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. నిజానికి రానా ఎలాంటి పాత్రలోనైనా పరకాయం ప్రవేశం చేసేస్తాడు. ఆ పాత్రకి రానా కారణంగా మరింత హుందాతనం వచ్చేస్తుంది.
కానీ లుక్స్ వైజ్‌గా తెచ్చిన మేకోవర్, యాక్టింగ్ పరంగా కనిపించడంలేదు 'మహానాయకుడు'లో. ఎందుకో కన్ఫ్యూజ్డ్ ఫీచర్స్‌తో కనిపిస్తున్నాడు రానా. అస్సలు కాన్ఫిడెన్స్ కనిపించడంలేదు రానాలో. ఇక శ్రీతేజ మాత్రం మాట్లాడకుండానే చూపుల్తోనే పూర్తిగా పాత్ర తాలూకు ఇంపాక్ట్‌ని చూపించేస్తున్నాడు. నిజానికి స్టార్డమ్, యాక్టింగ్ అనుభవం వంటి విషయాల్ని బేరీజు వేస్తే, రానా దగ్గుబాటితో పోల్చితే శ్రీతేజ జీరో. అసలా నటుడెవరో ఎవరికీ తెలీదు. కానీ బాగా డామినేట్ చేసేస్తున్నాడు రానాని.
ఇక 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో ఎన్టీఆర్ పాత్ర పోషించిన నటుడు కూడా అంతే. ఈయనకు ఇంతవరకూ సినీ పరిశ్రమతో టచ్చే లేదు. ఓ రంగస్థల నటుడు. కానీ ఎన్టీఆర్ పాత్రలో ఎంతగా ఒదిగిపోయాడంటే ఎన్టీఆర్‌ని మళ్లీ తెలుగు గడపల్లోకి తెచ్చేసిన ఫీల్ కల్పిస్తున్నాడు. ఇక ఆయన కొడుకు నందమూరి బాలకృష్ణ ఆ పాత్రకు ప్రాణం పోయాల్సింది పోయి, బాలయ్యా నువ్వెందుకు ఆ మహానుభావుని పాత్ర పోషించావయ్యా, పరువు తీస్తున్నావయ్యా.? అంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.