బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఈ నెల 27న గ్రాండ్‌గా లాంఛ్ కానుంది. ఈ లాంఛింగ్ కార్యక్రమానికి రామ్‌చరణ్ స్పెషల్ గెస్గ్‌గా రానున్నాడట. అదే రోజు చరణ్ బర్త్‌డే కావడం విశేషం. ఈ మధ్య సినిమా ఫంక్షన్స్‌లో ఒకరి సినిమాలకు ఇంకొకరు గెస్ట్‌లుగా వచ్చి వారి మధ్య స్నేహ భావాన్ని చాటుకుంటున్నారు. అలా బన్నీ సినిమా లాంఛింగ్‌కి చరణ్ రావడం ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపుతోంది.
ఇదిలా ఉంటే, బన్నీ మరోవైపు సుకుమార్ సినిమాకీ కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలూ సమాంతరంగా పట్టాలెక్కించే యోచనలో అల్లు అర్జున్ ఉన్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చే సినిమాని ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్‌లో రూపొందించనున్నారట. ఫుల్ పంచ్ డైలాగులతో త్రివిక్రమ్ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారట. ఆల్రెడీ స్క్రిప్టు పనులు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారమ్.
ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఫిక్స్ కాలేదు కానీ, కియారా అద్వానీ పేరు పరిశీలనలో ఉంది. సుకుమార్ సినిమాకి సంబంధించి పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సుకుమార్ ఎంతో ఇష్టపడి ప్రిపేర్ చేసిన స్క్రిప్టుని మహేష్‌తో తెరకెక్కించాలనుకున్నాడు. కానీ టెక్నికల్‌గా మహేష్‌కీ, సుకుమార్‌కీ డీల్ సెట్ కాకపోవడంతో అదే స్క్రిప్టును బన్నీతో తెరకెక్కించేందుకు సుకుమార్ సంసిద్దమవుతున్నారు.