భయపెట్టి హిట్టు కొట్టేలా ఉన్నాడు సుమీ.!

మరిన్ని వార్తలు

'తూనీగా తూనీగా' చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ కుర్రాడు సుమంత్‌ అశ్విన్‌. అంతకు ముందు ఆ తర్వాత', 'కేరింత' తదితర సినిమాలతో హీరోగా మంచి మార్కులేయించుకున్నాడు. 'హ్యాపీ వెడ్డింగ్‌' అంటూ మెగా డాటర్‌ కొణిదెల నిహారికతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేశాడు. స్క్రీన్‌పై ఎలాంటి ఎమోషన్‌ అయినా పండించడంలో మనోడు దిట్ట. కానీ బ్రేక్‌ రావడం లేదు. దాంతో రేస్‌లో వెనకే ఉండిపోతున్నాడు. 

 

ఇంతవరకూ లవర్‌బోయ్‌గా సత్తా చాటిన సుమంత్‌ అశ్విన్‌, ఇప్పుడు కాస్త బయటికొచ్చి జోనర్‌ ఛేంజ్‌ చేసి హిట్‌ కొట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. సుధీర్‌బాబు హీరోగా వచ్చిన హారర్‌ కామెడీ చిత్రం 'ప్రేమకథా చిత్రమ్‌' సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాల్లో పెద్ద హిట్టు కొట్టింది ఈ సినిమా. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న 'ప్రేమకథా చిత్రమ్‌ 2' సినిమా సుమంత్‌ అశ్విన్‌ చేతిలో పడింది.

 

దాదాపు చిత్రం షూటింగ్‌ పూర్తి కానుంది. తాజాగా రిలీజ్‌ డేట్‌ కూడా అనౌన్స్‌ చేసింది చిత్ర యూనిట్‌. మార్చి 21న ఈ హారర్‌ కామెడీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి పార్ట్‌లాగానే పోస్టర్స్‌తోనే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. నందితా శ్వేత, సిద్దీ ఇద్నానీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ నయా 'ప్రేమకథా చిత్రమ్‌ 2'తో సుమంత్‌ అశ్విన్‌ సత్తా చాటుతాడేమో చూడాలి మరి. హరికిషన్‌ అనే ఓ యంగ్‌ డైరెక్టర్‌ ఈ సినిమాతో పరిచయమవుతున్నాడు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS