'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' పై సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ కామెంట్స్

By iQlikMovies - January 11, 2019 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నందమూరి తార‌క రామారావు జీవిత క‌థ‌ను ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపంలో తెరకెక్కించారు. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ బ‌యోపిక్ రెండు భాగాలుగా రూపొందింది. ఎన్టీఆర్ సినీ ప్ర‌స్థానం ఆధారంగా చేసుకుని తొలి భాగం `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` రూపొందింది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 9న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

 

తండ్రికి త‌గ్గ త‌నయుడిగా, ఎన్టీఆర్ న‌ట వార‌సుడిగా బాల‌కృష్ణ న‌ట‌న అద్వితీయం అంటూ అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. ఇటు ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాలే కాదు.. విమ‌ర్శ‌కుల‌ ప్ర‌శంస‌లు కూడా అందుకుంటోంది. అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగా సుమంత్‌, నంద‌మూరి హ‌రికృష్ణ పాత్ర‌లో క‌ల్యాణ్‌రామ్‌లు అద్భుతంగా ఒదిగిపోయార‌ని ప్ర‌శంసిస్తున్నారు.

 

న‌టసింహ నంద‌మూరి బాల‌కృష్ణతో `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` వంటి సెన్సేష‌న‌ల్ మూవీని తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు జాగర్ల‌మూడి రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ బ‌యోపిక్‌ను సాయికొర్ర‌పాటి, విష్ణు ఇందూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్‌.బి.కె.ఫిలింస్‌, వారాహి చ‌ల‌న చిత్రం, విబ్రి ప‌తాకాల‌పై నంద‌మూరి వ‌సుంధ‌రా దేవి, నంద‌మూరి బాల‌కృష్ణ ఈ బ‌యోపిక్‌ను నిర్మించి.. తెలుగు జాతి గొప్ప‌తనాన్ని, ఔన‌త్యాన్ని భావిత‌రాల‌కు అందించే గొప్ప ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టారు.

 

ఈ సంద‌ర్భంగా ప్రత్యేకంగా వీక్షించిన సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ -``నంద‌మూరి బాల‌కృష్ణ రూపొందించిన య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్ చూశాను. చాలా బావుంది. సినిమా చూసిన‌ట్లు కాకుండా ఒక లైఫ్ చూసిన‌ట్టు అనిపించింది. బాల‌కృష్ణ‌గారు.. ఎన్టీఆర్‌గారిలా వంద‌శాతం క‌నిపించారు. ఆయ‌న వేసిన అన్నీ గెట‌ప్స్‌లోనూ బావున్నారు. డెఫ‌నెట్‌గా సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని  ఆశిస్తున్నాను`` అన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS