బిగ్‌బాస్‌కి నో చెప్పిన వెంకీ.!

By iQlikMovies - January 12, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్‌ హోస్ట్‌గా బుల్లితెరపై తొలిసారి తెలుగులో బిగ్‌బాస్‌ మెగా రియాల్టీ షో మంచి స్పందన తెచ్చుకుంది. ఎన్టీఆర్‌ తొలిసారి హోస్ట్‌ అవతారమెత్తి, తనదైన శైలిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఈ రియాల్టీ షోకి వన్నె తెచ్చాడు. తర్వాతి సీజన్‌లో నేచురల్‌ స్టార్‌ నాని హోస్ట్‌గా పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎట్టకేలకు బిగ్‌బాస్‌ విన్నర్‌ కౌషల్‌ పుణ్యమా అని, ఆయన ఫ్యాన్స్‌ కౌషల్‌ ఆర్మీ పుణ్యమా అని రెండో సీజన్‌ కూడా ఓ మోస్తరు సక్సెస్‌నే ఖాతాలో వేసుకుంది. 

 

సక్సెస్‌ కన్నా కాంట్రవర్సీలే ఎక్కువగా నడిచాయి రెండో సీజన్‌లో. అంతకు మించి మసాలా అంటూ నాని చెప్పినట్లే, మాస్త్‌గా కాంట్రవర్సీల హంగామా చేసి, ఎలాగోలా షోని సక్సెస్‌ చేశారంతే. ఇక త్వరలో బిగ్‌బాస్‌ సీజన్‌ 3 స్టార్ట్‌ కానుంది. ఆ సీజన్‌లో సందడి చేయబోయే సెలబ్రిటీస్‌ వీళ్లే అంటూ ఓ లిస్ట్‌ కూడా విడుదల చేసింది బిగ్‌బాస్‌ నిర్వాహక యూనిట్‌. అయితే ఈ సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించేదెవరా.? అనే ఆశక్తితో ఆడియన్స్‌ ఉన్నారు. హోస్ట్‌గా ఈ సారి వెంకటేష్‌ పేరు బాగా వినిపించింది. 

 

అయితే తాజాగా ఇదంతా జస్ట్‌ రూమర్‌ అని వెంకీ కొట్టిపారేశారు. వెంకీ సంక్రాంతికి 'ఎఫ్‌ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్స్‌లో ఈ క్లారిటీ ఇచ్చేశారు. అయితే నిజంగానే వెంకీ బిగ్‌బాస్‌కి నో అన్నాడా.? మరోవైపు వెంకీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చైతూతో నటిస్తున్న 'వెంకీ మామ' సినిమా ఆల్రెడీ సెట్స్‌పై ఉంది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇవి కాక మరిన్ని సినిమాల్ని వెంకీ లైన్‌లో పెట్టేసిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS