వెంకటేష్, వరుణ్‌తేజ్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన 'ఎఫ్ 2' ట్రైలర్ బయటికొచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్‌కి పెట్టింది పేరైన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకుడు. కాగా ఈ సినిమా మొదట్నుంచీ ఓ మోస్తరు అంచనాల్ని క్రియేట్ చేస్తోంది. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకీ ఈ మధ్య విలక్షణ కథలను ఎంచుకుంటూ వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు.
అయితే 'ఎఫ్ 2'తో ఇదివరకటి వెంకీని బయటికి తీసుకొచ్చాడు అనిల్ రావిపూడి. ఇకపోతే వరుణ్‌కి కొత్త సబ్జెక్ట్ అయిన కామెడీ టచ్ ఇచ్చి కొత్త కిక్కిచ్చాడు. ఇదిలా ఉంటే, తమన్నా, మెహ్రీన్‌లు ఈ సినిమాలో వెంకీకి, వరుణ్‌కి భార్యల పాత్రలు పోషిస్తున్నారు. కోపంతో భర్తపై చిర్రుబుర్రులాడే భార్యగా తమన్నా కనిపించింది. హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ అన్నింట్లోనూ తానే బెస్ట్ అని బలవంతంగా ఒప్పించే భార్యగా మెహ్రీన్ నటించింది. ఈ భార్యల నడుమ భర్తలు పడే ఫ్రస్టేషన్ నుండి పుట్టిన ఫన్ అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలానే ఉంది.
ట్రైలర్‌ని పూర్తిగా ఫన్‌తోనే నింపేశారు. తమన్నా, మెహ్రీన్ ఇద్దరూ గ్లామరస్‌గా కనిపించడమే కాదు, ఓ సీన్‌లో బికినీలతోనూ దడదడలాడించేశారు. ట్రైలర్‌లో సీనియర్ నటి అన్నపూర్ణ ఫన్ అక్కడక్కడా నవ్వించి మెప్పించింది. మొత్తానికి 'ఎఫ్ 2' ఓ పక్క హీరోల ఫ్రస్టేషన్ ఫన్‌తోనూ, హీరోయిన్ల గయ్యాలీ గ్లామర్‌తోనూ పండక్కి అలరించేయడానికి సిద్ధమైపోయింది. ఆ కిక్కు తలకెక్కించుకునేందుకు ఈ నెల 12 నుండి ధియేటర్స్‌లో సందడి చేయనుంది 'ఎఫ్ 2'.