'కైరా' కంట నీరు పెట్టించిన ప్రముఖ టీవీ ఛానల్..!

By iQlikMovies - January 08, 2019 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తన నటనతో మంత్ర ముగ్దుల్ని చేసిన బాలీవుడ్ నటి 'కైరా అద్వానీ'. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ తో కైరా టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరి, స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం కైరా, రామ్ చరణ్ తో కలిసి నటించిన 'వినయ విధేయ రామ' సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఒక తెలుగు టీవీ ఛానల్ తీసుకున్న నిర్ణయం కైరా తో కంట తడి పెట్టించింది. 

 

ప్రతి సంవత్సరం జీ టీవీ ఉత్తమ నటీనటులను గుర్తించి 'జీ సినీ అవార్డ్స్' ద్వారా గౌరవిస్తుంటుంది. అలాగే ఈ సంవత్సరం జరిగిన 'జీ సినీ అవార్డ్స్ 2018' వేడుకలో కైరా అద్వానీని 'ఉత్తమ డెబ్యూ హీరోయిన్' అవార్డుతో పురస్కరించింది. ఆ వార్త విన్న కైరా ఆనందంతో భావోద్వేగానికి గురైంది. 'భరత్ అనే నేను' చిత్రం తనకి మంచి జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని, వసుమతి పాత్రలో తన నటనకి మంచి గుర్తింపు వచ్చిందని, తనని ఇంతలా ఆదరించి తమ ఓట్లతో ఈ అవార్డు దక్కేలా చేసిన ప్రేక్షక అభిమానులందరికి ధన్యవాదములు అంటూ సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టింది. 

 

అలాగే, తనని తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన మహేష్, నమ్రతలకు కృతజ్ఞతలు తెలుపుతూ.... ఈ అవార్డు అందుకున్నందుకు ఆనందంతో కంట నీరు వస్తోందంటూ భావోద్వేగానికి లోనైంది. ఈ ఉత్సాహంతో మరిన్ని కొత్త కొత్త పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా, అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి కైరా అద్వానీనే హీరోయిన్ గా తీసుకున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కాకుండా, 'అర్జున్‌రెడ్డి' హిందీ రీమేక్‌ 'కబీర్‌ ఖాన్‌'లో కూడా కైరా నే హీరోయిన్‌గా నటిస్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS