మాస్‌ స్టెప్పులు ఇరగదీసేసిన బుల్లెట్‌ పాప.!

By Inkmantra - April 03, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

'బుల్లెట్టు మీదొచ్చే బుల్‌ రెడ్డీ..' అంటూ బుల్లెట్‌పై వచ్చి కుర్రకారు గుండెల్లో రొమాంటిక్‌ గంటలు మోగించేసింది ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పుత్‌. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సీత' సినిమా కోసం పాయల్‌ రాజ్‌పుత్‌ స్పెషల్‌ సాంగ్‌లో చిందేసింది. లేటెస్ట్‌గా విడుదలైన ఈ పాటకు విడుదలైన కాసేపట్లోనే వ్యూస్‌ పోటెత్తాయి. బుల్‌ రెడ్డి సాంగ్‌ రేపు విడుదలవుతోంది అంటూ నిన్న అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. పాయల్‌ రాజ్‌పుత్‌ హాట్‌ స్టిల్స్‌ రిలీజ్‌ చేసి సాంగ్‌పై అంచనాలు, ఆశక్తి పెంచేశారు. 

 

 

అంచనాలకు తగ్గట్లుగానే ఈ బుల్‌రెడ్డి సాంగ్‌ ఉండడంతో రెస్పాన్స్‌ అదిరిపోతోంది. ఈ సాంగ్‌లో పాయల్‌ రాజ్‌పుత్‌ సోలో పర్‌ఫామెన్స్‌ ఇరగదీసేసింది. సెక్సీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రోళ్ల మదిలో కేక పుట్టించేసింది. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్‌ అందించిన ఈ సాంగ్‌కి ధియేటర్స్‌ బద్దలు కావడం ఖాయమంటున్నారు పాయల్‌ ఫాన్స్‌. ఆ రేంజ్‌లో హాట్‌ హాట్‌ స్టెప్పులేసేసింది పాయల్‌ రాజ్‌పుత్‌. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

లేటెస్ట్‌గా విడుదలైన ట్రైలర్‌ హ్యూజ్‌ రెస్పాన్స్‌ అందుకుంది. పాయల్‌ స్పెషల్‌ సాంగ్‌ సినిమాకి స్పెషల్‌ అట్రాక్షన్‌ అనడంలో సందేహం లేదు. ఈ సినిమాతోనే తొలిసారి స్పెషల్‌ సాంగ్‌లో దర్శనమిచ్చింది పాయల్‌. మరోవైపు పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా 'డిస్కోరాజా', 'వెంకీ మామ' చిత్రాలు రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. పాయల్‌ లీడ్‌ రోల్‌లో 'ఆర్‌డీఎక్స్‌' అనే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ ఒకటి వెరీ లేటెస్ట్‌గా సెట్స్‌పైకి వెళ్లింది.   


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS