`డీజే` తరవాత హరీష్ శంకర్ సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. `దాగుడు మూతలు` స్క్రిప్టు రెడీ చేసుకున్నా- హీరోలెవరూ ముందుకు రాకపోయే సరికి ఆ కథని పక్కన పెట్టేశాడు. తమిళంలో సూపర్ హిట్టైన `జిగడ్తాండ` రీమేక్ హరీష్ చేతిలో పడింది. కానీ.. ఆ సినిమా ప్రారంభం అవుతుందా? లేదా? అనే అనుమానాలు ఉండేవి.
ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లింది. ఈరోజు (ఆదివారం) హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. టైటిల్‌ని చెప్పడంతో పాటు.... లోగోని కూడా ఆవిష్కరించారు. ఈ చిత్రానికి `వాల్మీకి` అనే పేరు ఖరారు చేశారు. టైటిల్ లోగోలో కూడా కథ చెప్పే ప్రయత్నం జరిగింది.
క్లాప్ బోర్డు, తుపాకీ, సినిమా రీలు.. ఇలా రకరకాల ప్రాపర్టీస్‌ని వాడుకున్నారు. గబ్బర్ సింగ్ లోగో చాయలు కొన్ని కనిపించాయి. తమిలంలో సిద్దార్థ్, బాబీ సింహా ప్రధాన పాత్రలు పోషించారు. బాబీ సింహా పాత్రలో వరుణ్ తేజ్ నటించనున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుంది.