మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ విషయం బయటికి వచ్చినా మెగా అభిమానులకి పండగే. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ముగ్గురున్నారు. వాళ్ళు వరుణ్ తేజ్, అల్లు శిరీష్ మరియు సాయి ధరమ్ తేజ్. వీరిలో ఒకరు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ ని 'రీల్ లైఫ్ లో పెళ్లి చేసుకున్నారు.. మరి రియల్ లైఫ్ లో ఎప్పుడు?' అని అడిగిన ప్రశ్నకి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.
ఇంట్లో వాళ్ళు కూడా త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వమంటున్నారు. నేను మాత్రం మరో మూడు సంవత్సరాల వరకు పెళ్లి మాట వద్దని, సినిమాల పైనే దృష్టి పెడతానని చెప్పాను. అయితే, ఎఫ్2 సినిమా చేశాక మాత్రం పెళ్లి చేసుకోకూడదు అన్న ఆలోచన నుంచి చేసుకుంటా అనేవరకు వచ్చాను, కానీ ఎప్పుడు చేసుకుంటానో కచ్చితంగా చెప్పలేనని అన్నాడు.
ఇంకా చాలామంది సీనియర్ హీరోలు పెళ్ళి చేసుకోకుండా ఉన్నారు. ఫస్ట్ మన రానా ఉన్నాడు వెయిటింగ్ లో. తను పెళ్లి చేసుకోగానే నేను కూడా చేసుకుంటా అంటూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే గుర్తొచ్చేది ప్రభాస్ మరియు రానా లే. యంగ్ హీరోలను ఎవరినైనా పెళ్లి గురించి అడిగితే వాళ్ళ పేర్లు చెప్పి మాట దాటేస్తుంటారు. ఇప్పుడు వరుణ్ కూడా అలాగే తన పెళ్లిని రానా తో లింక్ పెట్టి టాపిక్ ని డైవర్ట్ చేసాడు.
ప్రస్తుతం వరుణ్ తేజ్, వెంకటేష్ తో కలిసి నటిస్తున్న 'ఎఫ్2' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిర్మించబడిన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి అల్లుళ్ళు గా ప్రేక్షకులను అలరించటానికి జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు.