వెంకటేష్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఈ విషయంలో ఆయన్ని కొట్టేవాడే లేడు. ముఫ్ఫై ఏళ్లుగా కామెడీ విషయంలో తనే నెంబర్ వన్. అయితే... తన టైమింగ్ వెనుక ఉన్న సీక్రెట్‌ని వెంకటేష్ చెప్పేశాడు. ''కామెడీ టైమింగ్ చాలా కష్టం. తొలి రెండు టేకుల్లో ఆ షాట్ అయిపోవాలి. ఆ తరవాత మళ్లీ రమ్మంటే రాదు. వన్ మోర్ అన్నారంటే నాకు భయం వేసేస్తుంది. ఇక చేయలేను. నా విక్నెస్ అదే. 'ఎఫ్ 2' విషయంలో అలా చాలాసార్లు జరిగింది.
రెండో టేక్ అయ్యాక.. అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చి అనిల్‌తో ఏదో చెప్పేవారు. దాంతో నాకు భయం వేసేసేది. మళ్లీ చేయమంటారేమో అని చాలా భయపడేవాడ్ని'' అంటూ... కామెడీ టైమింగ్ వెనుక ఉన్న కష్టాల్ని చెప్పేశాడు వెంకీ. తను కథానాయకుడిగా నటించిన `ఎఫ్ 2` ఈ సంక్రాంతి పండక్కి వస్తోంది. ఈనెల 12న విడుదల అవుతోంది. ''పండక్కి విడుదలైన నా సినిమాలన్నీ బాగా ఆడాయి. హిట్స్ అయ్యాయి. ఈసారి ఎఫ్ 2కీ అలాంటి విజయమే దక్కుతుందన్న నమ్మకం ఉంది'' అని ఈ సినిమాపై తన నమ్మకాన్ని బయటపెట్టాడు వెంకీ.