'ఏ' సర్టిఫికెట్‌ వస్తే ఆనందమే.!

మరిన్ని వార్తలు

ట్రెండ్‌ మారింది గురూ. గతంలో సెన్సార్‌ బోర్డ్‌ నుండి 'ఏ' సర్టిఫికెట్‌ వస్తే కాస్త బాధగా ఫీలయ్యేవారు. 'ఏ' సర్టిఫికెట్‌ మూవీ అంటే హింసను ప్రేరేపించే సన్నివేశాలూ, అడల్ట్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయనీ, సో ఫ్యామిలీతో, పిల్లలతో కలిసి ధియేటర్స్‌కి వచ్చే ఆడియన్స్‌ తక్కువగా ఉంటారనీ నిరుత్సాహపడేవారు. కానీ మారిన ట్రెండ్‌ నిమిత్తం, 'ఏ' సర్టిఫికెట్‌ వచ్చిన సినిమాలు పండగ చేసుకుంటున్నాయిప్పుడు. మా సినిమాకి క్లీన్‌ 'ఏ' సర్టిఫికెట్‌ వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నాయి. 

 

గతంలో క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌కి మాత్రమే ఇలా చర్చించుకునేవారు. మొన్నీ మధ్య విడుదలైన 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాకి క్లీన్‌ ఏ సర్టిఫికెట్‌ వచ్చిందహో అని సంబరాలు చేసుకున్నారు. ఓపెనింగ్స్‌ కూడా అలాగే వచ్చాయి ఆ సినిమాకి. తాజాగా సమంత నటించిన 'సూపర్‌ డీలక్స్‌' సినిమాకి 'ఏ' సర్టిఫికెట్‌ వచ్చింది. విజయ్‌ సేతుపతి, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో జుగుప్సాకరమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉన్నాయని ప్రచార చిత్రాల ద్వారా ఆల్రెడీ చూజాయగా ఆడియన్స్‌కి తెలిసింది. 

 

ఇక తాజా సెన్సార్‌ రిపోర్ట్‌తో ఇంకా అభ్యంతరకర సన్నివేశాలేవో ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్‌సేతుపతి ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్నాడు. 'బాహుబలి'లో శివగామిగా సత్తా చాటిన రమ్యకృష్ణ పోర్న్‌ స్టార్‌గా నటిస్తోంది. సమంతపై బీభత్సమైన ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ ఉంది. ఇన్ని స్పెషాలిటీస్‌ ఉన్న ఈ సినిమా ఈ నెల 29న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS