మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ అంచనాల్ని అందుకోవడంలో పూర్తిగా ఫెయిలైంది. చరణ్ స్టార్‌డమ్‌తో ఎలాగోలా మొత్తం 63 కోట్లు షేర్‌తో బిజినెస్ క్లోజ్ అనిపించుకుంది. ఇక బాలయ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సొంత నిర్మాణంలో రూపొందించిన 'ఎన్టీఆర్ - కథానాయకుడు' కూడా గట్టి పోటీతో బరిలోకి దిగింది.
కానీ జస్ట్ 21 కోట్లతోనే బిజినెస్ ముగించుకుంది. టోటల్‌గా ఈ రెండు సినిమాలూ డిజాస్టర్లగానే సంక్రాంతి లిస్టులో మిగిలిపోయాయి. అయితే చరణ్ కొంత మేర డిస్ట్రిబ్యూటర్స్‌ని నష్టాల నుండి గట్టెక్కించాడు. కానీ బాలకృష్ణ మాత్రం నిండా ముంచేశాడు. రెండు సినిమాల్నీ విశ్లేషిస్తే 'వినయ విధేయ రామ' పూర్తిగా డైరెక్టర్స్ ఫెయిల్యూర్‌గానే భావించాలి.
బోయపాటి శీను అభిమానుల అంచనాల్ని అందుకోవడంలో ఎందుకో పూర్తిగా పెయిలయ్యాడు. ఓపెనింగ్ డేకే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చేసింది. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్‌తో డైరెక్టర్ క్రిష్‌కి మాత్రం ప్రశంసలు దక్కాయి. సినిమా కూడా పోజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఏది ఏమైతేనేం 'కథానాయకుడు' ఫెయిల్యూర్ ఎలా జరిగింది.? అనేది ఇప్పటికీ శేష ప్రశ్నగానే మిగిలిపోయింది.