మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి ప్రధాన పాత్రలో వైఎస్సార్ బయోపిక్‌గా తెరకెక్కుతోన్న చిత్రం 'యాత్ర'. 'ఆనందో బ్రహ్మ' వంటి హారర్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించిన మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. కాగా ఈ సినిమాకి మొదట్లో అంతగా హైప్ రాలేదు. కానీ ఎన్టీఆర్' బయోపిక్ ఫెయిల్యూర్ కావడంతో 'యాత్ర' బజ్ పెరిగింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి.
ప్రచార చిత్రాలతో ఆ అంచనాలు బాగా పెరిగాయి. మరి కొద్ది రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగా సినిమాలో క్యారెక్టర్స్ గురించి డైరెక్టర్ తన మనసులోని అభిప్రాయాల్ని మీడియాతో పంచుకున్నారు. ఈ సినిమాని సినిమాగా మాత్రమే చూడాలని ఆయన చెప్పారు. ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా, క్లీన్‌గా ఈ సినిమాని తెరకెక్కించారట. అన్ని వర్గాల వారు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతారని డైరెక్టర్ అంటున్నారు.
ఇక వైఎస్ పాత్రకు ముమ్ముట్టినే ఎందుకు తీసుకున్నారంటే, 'ఆయన పాత్రను ఇమిటేట్ చేసేవారు కాదు, నటనలో జీవం చూపించేవాళ్లు కావాలని అనుకున్నాను. అదే తరుణంలో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న ముఖం కాకుండా, కొత్త వాళ్లైతే బావుంటుందని ముమ్ముట్టిని ఎంచుకున్నాననీ, 100 పర్సెంట్ ఆ పాత్రకు ముమ్ముట్టి న్యాయం చేశారు..' అని మహి చెప్పారు. వైఎస్ పాదయాత్రకు సంబంధించిన కొన్ని అంశాలు చాలా హృద్యంగా చూపించారట. ఇక ఈ సినిమాలో జగన్ పాత్ర లేదన్న సంగతి తెలిసిందే. అనసూయ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 8న 'యాత్ర' ప్రేక్షకుల ముందుకు రానుంది.