రామ్ చరణ్ మౌనానికి కారణం ఏమిటి..?

మరిన్ని వార్తలు

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైంది. కొన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ తమ ప్రచార కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సారి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగారు. ప్రతిసారీ జరిగే ఎన్నికల కంటే, ఈ సారి ఎన్నికల్లో సినిమా గ్లామర్ ఎక్కువగా ఉంది. కావున, ఈ సారి జరిగే ఎన్నికలపై ప్రజల్లో ఎన్నడూలేని ఉద్రిక్తత నెలకొంది.

 

కాగా.. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రోజు భీమవరం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ కూడా వేశారు. రేపోమాపో జనసేన ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టనున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగ బాబు కూడా జనసేన కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఒక్కరే కొనసాగించిన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఇకపై అయన కూడా దిగనున్నారు. మెగా డాటర్ నిహారిక కూడా 'సూర్యకాంతం' సినిమా ప్రమోషన్స్‌తో పాటు, బాబాయ్‌ తరపున జనసేన పార్టీ ప్రచారం కూడా నిర్వహించేస్తోంది. 

 

అయితే.. ప‌వ‌న్ కోసం ఎప్పుడైనా స‌రే ప్ర‌చారానికి సిద్ధ‌మ‌ని ఎప్పుడో ప్ర‌క‌టించిన మెగా హీరోలు మాత్రం ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదు. ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్ 'బాబాయ్ కోసం ఏమైనా చేస్తా' అనే మాట చాలాసార్లు చెప్పాడు. పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పని గురించి సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అవుతూ బాబాయ్ పై తనకున్న ప్రేమని చాటేవాడు. కానీ.. ఇప్పుడు మాత్రం ఎక్కడా అతని జాడే లేదు. ఒక్క నాగబాబు ఫ్యామిలీ తప్ప మిగిలిన వారెవ్వరూ జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కనిపించటం లేదు. 

 

చూడాలి మరి.. ఇకముందైనా మెగా కుటుంబ సభ్యులు పవన్ కోసం కదిలొస్తారేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS