యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ స్టార్టింగ్ నుండీ ప్రయోగాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. అసలు గతంలో శర్వాకీ, 'ఎక్స్‌ప్రెస్ రాజా' తర్వాత శర్వాకీ పోలికే లేదనాలి. మొదట్లో యంగ్ హీరోగా అయినా బరువైన పాత్రలు పోషించి, నటుడిగా తనదైన శైలితో మెప్పించాడు. 'ఎక్స్‌ప్రెస్ రాజా'తో కామెడీని టచ్ చేసి సక్సెస్‌ల హీరోగా ముద్ర వేయించుకున్నాడు. అయితే గతేడాది చివర్లో వచ్చిన 'పడి పడి లేచె మనసు' శర్వాని బాగా డిజప్పాయింట్ చేసింది.
అయితే కమర్షియల్‌గా డిజప్పాయింట్ చేసినా, శర్వా నటనకు ప్రశంసలే దక్కాయి. ఇకపోతే 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' వంటి సినిమాలో రామ్ పాత్రలో శర్వా కాబట్టే అలా ఒదిగిపోయాడు. ఇక ఈ ఏడాది శర్వా రెండు సినిమాలతో సందడి చేయబోతున్నాడు. అందులో ఒకటి సుధీర్ వర్మ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ వయసు మళ్లిన పాత్రలో కనిపించబోతున్నాడు. శర్వాకి అది సాధ్యమే. ఆడియన్స్‌ని కన్విన్స్ చేసేస్తాడు కూడా.
ఇకపోతే తాజాగా సమంతతో శర్వా ఓ ప్రయోగమే చేస్తున్నాడనుకోవాలి. తమిళంలో ఘన విజయం సాధించిన '96' మూవీని తెలుగులో దిల్‌రాజు బ్యానర్‌లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రైట్స్‌ని శర్వాపై నమ్మకంతోనే దిల్‌రాజు దక్కించుకున్నారంటే, శర్వా యాక్టింగ్ టాలెంట్ గురించి ఎంతగా చెప్పుకున్నా తక్కువే అవుతుందనాలి కదా. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో శర్వానంద్, సమంత కనిపించబోతున్నారీ సినిమాలో.