అంకెల్ని, అంచ‌నాల్నీ దాటేసిన బాహుబ‌లి

మరిన్ని వార్తలు

ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 9 వేల స్క్రీన్‌ల‌లో విడుద‌లైంది బాహుబ‌లి 2. ఈ సినిమాకి వ‌చ్చిన హైప్ చూసి.. తొలిరోజే బాహుబ‌లి క‌చ్చితంగా 100 కోట్లు సాధిస్తుంద‌ని అంచ‌నా వేశారంతే. ఆ అంకెల్ని, అంచ‌నాల్నీ బాహుబ‌లి 2 దాటేసింద‌ని స‌మాచారం. తొలి రోజు బాహుబ‌లికి రూ.130 కోట్ల వ‌ర‌కూ ద‌క్కొచ్చ‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా. ప్రీమియ‌ర్ షోల టికెట్ ధ‌ర‌, తొలిరోజు బుక్కింగులు చూసి ట్రేడ్ వ‌ర్గాలు ఈ సినిమా తొలి రోజు క‌ల‌క్ష‌న్ల‌పై ఓ అంచనాకు వ‌చ్చేశారు. కచ్చితంగా తొలిరోజు రూ.130 కోట్లు తెచ్చేసుకొని ఉంటుంద‌ని లెక్క‌లు కట్టారు. అంటే ఆల్ ఇండియా రికార్డ్ బాహుబ‌లి 2 పేరిట రాసేసుకొన్న‌ట్టే. ఖాన్ త్ర‌యంల‌కు కూడా సాధ్యం కాని అంకె ఇది. అందుకే... మ‌రోసారి బాహుబ‌లికి జ‌య‌హో అనేసుకోండి. మున్ముందు ఈ రాజ‌మౌళి క‌ల‌ల చిత్రం ఎన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS