బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 వచ్చే ఆదివారం నుండి ప్రసారం కానున్న నేపధ్యంలో ఈ సీజన్ కి సంబందించిన ఒక అధికారిక ప్రెస్ మీట్ ని కొద్దిసేపటి క్రితం నిర్వహించారు. ఇందులో ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా నిర్వహించనున్న నాని విలేఖరులతో ముచ్చటించారు.
ఇక వ్యాఖ్యాతగా చేయబోతుండడం ఎలా ఉంది అని ప్రశ్నించగా- దీనిని ఒక సవాలుగానే తీసుకుంటాను అని.. తప్పకుండా అందరిని మెప్పిస్తాను అని చెప్పాడు. ఇక హోస్టింగ్ విషయంలో ఎన్టీఆర్ తో పోల్చడం పట్ల స్పందిస్తూ- తాను ఇప్పటివరకు అసలు బిగ్ బాస్ షో చూడలేదు అని పైగా మొదటి సీజన్ మా ఇంట్లో వాళ్ళు చూస్తుంటే తిట్టేవాడిని అని గుర్తుచేసుకున్నాడు.
ఈ సమయంలో, పోయిన సీజన్ మీరు అసలు చూడలేదా? అని ప్రశ్నించగా- ఇంతవరకు తాను బిగ్ బాస్ చూడలేదు అని ఒక షాక్ ఇచ్చడు. అయితే ఇప్పుడు మాత్రం తాను ప్రత్యేకంగా ఆ వీడియోలు తెప్పించుకుని చూస్తాను అని తెలిపాడు.
మరి ఎన్టీఆర్ స్థాయిలో ప్రేక్షకులని నాని మెప్పిస్తాడా లేదా అనేది చూడాలి.