అన్నయ్యతో సినిమా ఇప్పట్లో లేదు: పవన్!

మరిన్ని వార్తలు

అమెరికా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఒక పెద్ద బాంబు పేల్చారనే చెప్పాలి.

ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించిన అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానం చెబుతూ అన్నయ్య (చిరంజీవి) సినిమా చూశానని బాగా ఎంజాయ్ చేసానని చెప్పాడు. అలాగే తను చిరంజీవి కలిసే నటించే ప్రపోసల్ ఏమి తన వద్దకు రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా పవన్ బదులిచ్చాడు.

ఇలా చెప్పడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కింత షాక్ కి గురయ్యారు. అయితే ఈ మధ్యనే టీ సుబ్బరామిరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేసి మరి ఈ మెగా బ్రదర్స్ కలిసి సినిమా చేయబోతున్నారు అని చెప్పారు.

మరి పవన్ ఎందుకు ఇలా ప్రతిస్పందించాడు అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS