చరణ్ - బోయపాటి సినిమాకి హీరోయిన్ ఫిక్స్..

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయబోతున్న తాజా చిత్రం రేపటి నుండి హైదరాబాద్ లో మొదలుకానుంది. దీనికి మాస్ స్పెషలిస్ట్ గా పేరుపొందిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు చేస్తారు అన్న సస్పెన్స్ కి శుభం కార్డు పడింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా కైరా అద్వాని. ఈమె ప్రస్తుతం మహేష్ బాబు-కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో మహేష్ సరసన నటిస్తున్నది.

ఇదిలావుండగా ఈ సినిమాని వీలైంత త్వరగా పూర్తిచేసి విడుదల చేయాలి అన్న ఆలోచనలో ఇటు రామ్ చరణ్ అటు బోయపాటి శ్రీను ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం అనుకున్న సమయానికి విడుదల కాకపోవడంతో పోయిన ఏడాది రామ్ చరణ్ నుండి ఏ చిత్రం విడుదల కాలేదు.

అలాగే ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అని తెలిసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS