'రేపల్లె'లో చరణ్‌, సమంత

మరిన్ని వార్తలు

చరణ్‌ కొత్త సినిమాకి 'రేపల్లె' అనే టైటిల్‌ అనుకుంటున్నారు. ఇదో విభిన్నమైన ప్రేమకథ అట. ఇంతవరకూ ఇలాంటి తరహాలో ప్రేమ కథలు తెరక్కెలేదనీ ప్రచారం జరుగుతోంది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పల్లెటూరి వాతావరణంలో చాలా ఆహ్లాదంగా రూపొందుతోంది. గోదావరి పరిసర ప్రాంతాల్లోని అందాల్ని చిత్ర యూనిట్‌ ఆస్వాదిస్తూ, సినిమా చిత్రీకరణను చేపడ్తోంది. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో బుల్లితెర బ్యూటీ అనసూయ నటిస్తోందట. చరణ్‌కి తోడుగా అక్కడే ఉంటూ ఆయన భార్య ఉపాసన కూడా ప్రకృతి అందాలకు మైమర్చిపోతోంది. చరణ్‌ సోదరి సుస్మిత ఈ సినిమాలో చరణ్‌కి కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తోంది. పల్లెటూరి కుర్రాడి పాత్రలో సూటయ్యే కాస్ట్యూమ్స్‌ని తమ్ముడి కోసం సుస్మిత అత్యద్భుతంగా డిజైన్‌ చేస్తోందట. తన తండ్రి చిరంజీవి రీ-ఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాకి కూడా ఈమే కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసిన సంగతి తెలిసినదే కదా. సుకుమార్‌ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. పల్లెటూరి యువకుడిగా చరణ్‌ కన్పించబోతున్నాడు. ఆన్‌ లొకేషన్‌ స్టిల్స్‌ అభిమానుల్ని బాగా అలరిస్తున్నాయి. అంతేకాదు ఈ చిత్రంలో చరణ్‌ పాత్ర చాలా భిన్నంగా ఉండబోతోందంటున్నారు. మామూలు కమర్షియల్‌ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సమంత ఈ సినిమాలో చరణ్‌తో జోడీ కడుతోంది. తొలిసారిగా ఈ జంట ఈ సినిమా ద్వారా స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటుండడం విశేషం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS