మహేష్ 'స్పైడర్' USA రివ్యూ వచ్చేసింది..

మరిన్ని వార్తలు

మురుగుదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం స్పైడర్. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదలవుతోంది. కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మురుగుదాస్, టాలీవుడ్ లో స్టార్ హీరోగా మంచి పేరున్న మహేష్, తొలిసారి తమిళ పరిశ్రమకి పరిచయం కానున్నాడు. ఇప్పటికే విడుదల అయిన సినిమా టైలర్, సినిమా అంచనాలని రెట్టింపు చేసింది.

కాగా విడుదలకు ముందే సోషల్ మీడియాలో ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ విశ్లేషకుడు, సెన్సార్ బోర్డ్ మెంబర్ అయిన ఉమైర్ సంధు, సినిమా ఫలితాన్ని చెప్పేశారు. దసరా కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రం మహేష్ అభిమానులకు పండగ చేసుకునే విధంగా ఉంటుందని, యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కథ, కథనం ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పారు.

సమాజానికి హాని చేసే ఓ విలన్ ను అంతమొందించే పాత్రలో మహేష్ నటించాడని, కనిపించకుండా విలన్ చేసే మోసాలను అడ్డుకట్టవేస్తూ, ఆ విలన్ ఎవరో కనిపెట్టే పనిలో వేసే ఎత్తులు, పై ఎత్తులు ఆద్యంతం సినిమాని ఆసక్తి రేపుతాయని తెలిపారు. మహేష్ తన పాత్రలో అద్భుతంగా నటించారని, విలన్ గా ఎస్ జె సూర్య పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని, హీరోయిన్ రకుల్ తన పాత్రకు న్యాయం చేసిందని, హీరో స్నేహితుడి పాత్రలో ప్రియదర్శి, ఇతర నటీనటులు బాగా నటించారని, ఈ సినిమా మొత్తంలో క్లైమాక్స్ బెస్ట్ గా ఉంటుందని ఉమైర్ సంధు తెలిపారు.

మొత్తంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, మాస్, క్లాస్ ఆడియన్స్ కి నచ్చేవిధంగా ఈ సినిమా దసరాకి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం ఖాయమని చెప్పారు. ఈ సినిమాకి ఉమైర్ సంధు 3.5/5 రేటింగ్ కూడా ఇచ్చారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS