చేసిన తప్పు తెలుసుకున్న సునీల్..!

మరిన్ని వార్తలు

కమెడియన్ గా సునీల్ కి ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. అటువంటిది సునీల్ కమెడియన్ గా తన కెరీర్ ని పక్కకి పెట్టేసి పూర్తిస్థాయి హీరోగా కొత్త అవతారమెత్తాడు. ఇక హీరో ప్రయాణంలో మొదట్లో అంతా బాగానే జరిగే సరికి ఇక తనకి కమెడియన్ గా చేయాల్సిన అవసరం రాదు అని ఫిక్స్ కూడా అయిపోయాడు.

అయితే రోజులు అన్ని ఒకేలా ఉండవు కదా... క్రమక్రమంగా ఆయన హీరోగా చేసిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆయన కెరీర్ లో స్తబ్దత నెలకొంది. ఈ సమయంలో ఆయన మళ్ళీ తనని నిలబెట్టిన కామెడీ వైపు చూస్తున్నట్టు తెలుస్తున్నది. దీనికి తాజా ఉదాహరణే మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహ రెడ్డి లో ప్రధాన హాస్య పాత్రని సునీల్ చేయడానికి సిద్ధపడడమే.

అలాగే పవన్-త్రివిక్రమ్ అజ్ఞాతవాసి చిత్రంలో సైతం ఒక మంచి వేషంలో కనపడే అవకాశం త్రుటిలో కోల్పోయాడు అన్న వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నది. ఇవ్వని పక్కనపెడితే మళ్ళీ కామెడీ దారిలోకి సునీల్ వస్తున్నాడు అని తెలిసి ఆయన అభిమానులంతా సంతోషిస్తున్నారు.

ఎందుకంటే ఆయనకి హీరోగా ఉన్న అభిమానుల సంఖ్య ఆయన కమెడియన్ గా ఉన్న సంఖ్య లక్షల రెట్లు ఎక్కువ అని చెప్పొచ్చు. ఇక ఈ అంశాలు చూస్తున్న మరికొంతమంది సునీల్ దారిలో పడ్డాడు అని అంటున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS