బాలయ్య సినిమాలో అన్నీ ఉంటాయి - పూరీ

మరిన్ని వార్తలు

బాలకృష్ణ 101వ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. హైద్రాబాద్‌లోని కూకట్‌ పల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆనంద్‌ ప్రసాద్‌ ప్రొడక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. డేరింగ్‌ అండ్‌ డేషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వందో చిత్రంగా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాతో సంచలనాత్మక విజయం అందుకున్నాడు బాలయ్య. అలాగే 101 వ చిత్రం కూడా సెన్సేషనల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోంది. పూరీ, బాలయ్య కాంబినేషన్‌ అంటేనే చాలా క్రేజీ. ఈ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కడం అంటే మొదట్లో ఎవ్వరికీ నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ ఇది సాధ్యమైంది. సినిమా స్టార్ట్‌ అయ్యింది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే స్టార్ట్‌ కానుంది. సినిమా రిలీజ్‌ డేట్‌ని కూడా ముందే ప్రకటించేశాడు పూరీ. సెప్టెంబర్‌ 29న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేస్తాడట. అయితే ఈ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా ఎలా ఉండబోతోందో అని ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు బాలయ్య అభిమానులు. బాలయ్యతో సినిమా చేస్తుండడం చాలా సంతోషంగా ఉందని పూరీ తెలిపారు. అభిమానులు ఆశించే అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో ఉంటాయని ఆయన తెలిపారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS