యాంకర్ ప్రదీప్ కి శిక్ష ఏంటో తెలుసా?

మరిన్ని వార్తలు

యాంకర్ ప్రదీప్ డ్రంక్ & డ్రైవ్ కేసులో చిక్కుకున్న సంగతి విదితమే. 

ఇక దానికి సంబందించిన విచారణ నిమిత్తం ఈరోజు ఆయన నాంపల్లి లోని కోర్టుకి తన తండ్రితో కలిసి హజరయ్యాడు. ఇకకోర్టులో జడ్జిగారు, గతంలో ఇలా మద్యం సేవించి వాహనాలు నడపవద్దు అని ప్రచారం చేసిన నువ్వు మళ్ళీ ఇలా తప్పు చేయడం ఏంటి అని ప్రశ్నించగా- తప్పు జరిగింది.  క్షమించండి అని ప్రదీప్ అన్నట్టుగా సమాచారం. 

దీనితో జడ్జి గారు, చేసిన తప్పుకి శిక్షగా మూడు సంవత్సరాల పాటు ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ ని రద్దు చేస్తున్నట్టు తెలిపి అలాగే రూ 2100/- ని ఫైన్ గా జమ చేయమన్నట్టు ఆదేశించడం జరిగింది. ఇక ఇంతక్రితమే ఆయన తన తండ్రితో కలిసి పోలీసులు ఇచ్చే కౌన్సిలింగ్ కి సైతం హజరవ్వడం జరిగంది.  

ఈ తీర్పు ద్వారా ఆయనకీ ఏ శిక్ష పడుతుందా అని అనుకుంటున్న వారికి సమాధానం లభించింది. ఒక దశలో ఆయనకీ జైలు శిక్ష కూడా పడుతుంది అన్న వాదనలు కూడా వెలువడ్డాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS