నేచురల్ స్టార్ నాని తొలిసారి క్రికెటర్‌గా మారాడు. జెర్సీ సినిమా కోసం. అర్జున్ అనే ఆటగాడి కథ ఇది. ఇండియన్ క్రికెట్‌లో అడుగుపెట్టడం కోసం అర్జున్ పడిన కష్టాలు, త్యాగాలకు ప్రతిరూపం ఈ చిత్రం. ఈమధ్యకాలంలో తెలుగులో స్పోర్ట్స్ డ్రామా రాలేదు. ఆ లోటు 'జెర్సీ'తో తీరబోతోంది. అన్నట్టు ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ కూడా శరవేగంగా పూర్తవుతోందని టాక్.
శాటిలైట్, హిందీ డిజిటల్ డబ్బింగ్ రైట్స్ రూపంలో ఇప్పటికే 18 కోట్లు వచ్చాయట. ఓవర్సీస్ నుంచి మరో రూ.4 కోట్లు. అంటే ఇప్పటికే 22 కోట్ల వ్యాపారం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా మరో రూ.30 కోట్ల బిజినెస్ జరిగే అవకాశాలున్నాయి. అంటే.. మొత్తంగా జెర్సీ సినిమాకి విడుదలకు ముందే రూ.50 కోట్ల వ్యాపారం జరగబోతోందన్నమాట. గౌతమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.