అయోమ‌యంలో మారుతి

మరిన్ని వార్తలు

శైల‌జా రెడ్డి అల్లుడు ముందు వ‌ర‌కూ మారుతి ఆడిందే ఆట పాడిందే పాట‌. ఓ మోస్త‌రు హీరోలు మారుతికి ఆనేవారే కాదు. త‌న చూపెప్పుడూ అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ల‌పై ఉండేది. శైల‌జా రెడ్డి అల్లుడు హిట్ అయితే - నిజంగానే మారుతికి స్టార్ హీరోలు ఈజీగా దొరికేసేవారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో మీడియం రేంజు హీరోల‌తో స‌ర్దుకుపోవాల్సివ‌స్తోంది. అందుకే హిట్లు లేని సాయిధ‌ర‌మ్ తేజ్ తో సినిమా చేయ‌డానికి సిద్ద‌మ‌య్యాడు. 

 

అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ క‌థ సెట్ అవ్వ‌లేద‌ని టాక్‌. మారుతి బ‌న్నీ, చ‌ర‌ణ్ ల‌కు స‌రిప‌డా ఓ క‌థ‌ని సిద్దం చేసుకున్నాడు. దాన్ని కాస్త టోన్ త‌గ్గించి సాయిధ‌ర‌మ్ తేజ్‌కి వాడేద్దాం అనుకున్నాడు. కానీ.. అది ఇప్పుడు జ‌ర‌గ‌డం లేదు. 'ఈ క‌థ తేజూకి మ‌రీ ఓవ‌ర్ అయిపోతుంది.. మ‌రోటి చూడు' అంటూ అల్లు అర‌వింద్ అల్టిమేట్టం జారీ చేశార‌ని టాక్‌. దాంతో మారుతి ఇప్పుడు గంద‌ర‌గోళంలో ప‌డ్డాడు. కొత్త క‌థ రాసుకుని, సాయిధ‌ర‌మ్‌కి వినిపించి ఓకే చేయించుకోవాలా?? లేదంటే ఈ క‌థ‌ని మ‌రో హీరోకి చెప్పి క‌మిట్ అయిపోవాలా? అనేది తేల‌డం లేదు. 

 

సాయిధ‌ర‌మ్ తేజ్ 'చిత్ర‌ల‌హ‌రి' ఏప్రిల్‌లో విడుద‌ల అవుతుంది. ఆ త‌ర‌వాత తేజూ కొత్త సినిమాపై నిర్ణ‌యం తీసుకుంటాడు. ఈలోగా.. మారుతి క‌థ సిద్ధం చేయ‌డ‌ల‌డా అనేదే అనుమానం. ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS