'నా పేరు సూర్య' సినిమా తర్వాత బన్నీ నుండి సినిమా రాలేదింతవరకూ. అయితే తాజాగా బన్నీ రెండు సినిమాల్ని లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ - బన్నీ కాంబినేషన్‌లో సినిమా రేపో మాపో సెట్స్ పైకి వెళ్లనుందన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బన్నీ ఖాతాలో తాజాగా సుకుమార్ సినిమా వచ్చి చేరింది. టెక్నికల్ ప్రాబ్లెమ్స్ కారణంగా మహేష్‌తో చేయాల్సిన సినిమాని బన్నీతో చేసేందుకు సుకుమార్ కమిట్ అయ్యాడు.
అయితే బన్నీ ఇప్పుడు ఓ వైపు త్రివిక్రమ్ మూవీ, మరోవైపు సుకుమార్‌తో మూవీ రెండింటినీ సమాంతరంగా పూర్తి చేసి ఫ్యాన్స్‌కి స్పెషల్ కిక్ ఇవ్వనున్నాడట. ఎట్ ఏ టైమ్ రెండు, మూడు సినిమాల్లో నటించిన హిస్టరీ గతంలో బన్నీ ఖాతాలో ఉంది. అదే ట్రెండ్‌ని ఇప్పుడు ఫాలో చేయాలనుకుంటున్నాడట. సుకుమార్‌తో సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదికెళ్లనుందని సమాచారమ్. ఆల్రెడీ స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి కాబట్టి, ఈ సినిమాని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనే యోచనలో బన్నీ ఉన్నాడట.
అయితే సుకుమార్‌తో సినిమా అంటే అంత త్వరగా పూర్తయ్యే ఛాన్స్ లేదు. ఇదే రీజన్‌తో మహేష్ వెనక్కి తగ్గాడన్నది ఓ టాక్. అయితే సుకుమార్‌తో పోల్చితే త్రివిక్రమ్ ఇంకొంచెం ఫాస్ట్‌గా పూర్తి చేస్తాడు. ఏదిఏమైనా అల్లు అర్జున్ రెండు సినిమాల్నీ ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లాలని గట్టి పట్టు మీదున్నాడట. అలా చేస్తే ఈ ఏడాది చివర్లో బన్నీ నుండి ఓ సినిమా రావడం పక్కా. అది త్రివిక్రమ్‌దే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రధమార్ధంలో సుకుమార్ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. చూడాలి మరి.