బాల‌య్య - రాజ‌శేఖ‌ర్ కాంబో... ఉత్తిదే!

By Gowthami - March 23, 2019 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

తమిళ సూప‌ర్ హిట్ చిత్రం  ‘విక్రమ్ వేదా’ ని తెలుగులో రీమేక్‌ చేయడానికి ఎప్ప‌టి నుంచో స‌న్నాహాలు జ‌రుగుతూనే ఉన్నాయి. తెలుగులో ఈ సినిమా రీమేక్ చేయ‌డానికి నంద‌మూరి బాల‌కృష్ణ‌, రాజ‌శేఖ‌ర్ ముందుకొచ్చార‌ని మాధవన్‌, విజయ్‌ సేతుపతి పాత్రల్లో వీరిద్ద‌రూ క‌నిపిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే దీనిపై  వై నాట్‌ స్టూడియోస్‌ స్పష్టత ఇచ్చింది. ఈ సినిమా రీమేక్ హ‌క్కులు త‌మ వ‌ద్దే ఉన్నాయ‌ని, ఇంకా ఎవ్వ‌రికీ ఇవ్వ‌లేద‌ని, న‌టీన‌టులు ఎంపిక విష‌యంలో వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అవాస్త‌వం అని ధృవీక‌రించింది.

 

తెలుగులో కొంత‌మంది హీరోలు ఈ సినిమా రీమేక్ పై ఆస‌క్తిని చూపిస్తున్నారు. అయితే ఇదో మ‌ల్టీస్టార‌ర్‌. మాధ‌వ‌న్‌, విజ‌య్ సేతుప‌తిలా స్టార్ డ‌మ్ ఉన్న ఇద్ద‌రు హీరోలు క‌లిసి చేస్తే రీమేక్‌కి క్రేజ్ వ‌స్తుంది. ప్ర‌స్తుతం మ‌ల్టీస్టార‌ర్ల జోరు తెలుగులో ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. బాల‌య్య‌, రాజ‌శేఖ‌ర్‌లు కాక‌పోయినా.. ఈ రీమేక్‌కి హీరోలు దొర‌క్క‌పోరు. అయితే వై నాట్ స్టూడియోస్ మాత్రం.. తెలుగులో స్టార్ డ‌మ్ ఉన్న హీరోతోనే ఈ సినిమాని ప‌ట్టాలెక్కించాల‌ని ఆలోచిస్తోంది. మ‌రి ఆ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS