దిల్‌రాజు బోణీ కొట్టేశాడు కానీ..!

మరిన్ని వార్తలు

అభిరుచి గల సినిమాలను రూపొందించడంలో నిర్మాత దిల్‌రాజు రూటే సెపరేటు. ఆయన చేయి పడిందంటే చాలు ఆ సినిమా సూపర్‌హిట్టే.. అనే టాక్‌ ఉందింతవరకూ. అయితే గతేడాది దిల్‌రాజుకు అంతా రివర్స్‌ రిజల్ట్‌ వచ్చింది. రాజ్‌తరుణ్‌తో 'లవర్‌', నితిన్‌తో 'శ్రీనివాస కళ్యాణం', రామ్‌తో 'హలో గురూ..' ఇలా ఏకంగా మూడు సినిమాలు దిల్‌రాజు బ్యానర్‌ నుండి వచ్చినా, ఒక్కటంటే ఒక్కటీ దిల్‌రాజును నిలబెట్టలేకపోయింది. అయితే ఈ ఏడాది మొదట్లోనే 'ఎఫ్‌ 2'తో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టేశాడు దిల్‌రాజు.

 

సంక్రాంతి బరిలో నిలిచిన 'ఎన్టీఆర్‌ కథానాయకుడు', రామ్‌చరణ్‌ 'వీవీఆర్‌'లతో పోల్చితే 'ఎఫ్‌ 2'పై పెద్దగా అంచనాలు నమోదు కాలేదు. కానీ ముందుగా వచ్చిన ఆ రెండు సినిమాలు నెగిటివ్‌ టాక్‌తో సూపర్‌హిట్‌ బరిలో నిలవలేకపోవడంతో, అది 'ఎఫ్‌ 2'కి బాగా కలిసొచ్చేసింది. సంక్రాంతి అల్లుళ్లు వెంకీ, వరుణ్‌తేజ్‌ తమ కామెడీతో డబుల్‌ ధమాకా ఇచ్చేయడంతో సంక్రాంతికి అసలు సిసలు పండగ సినిమాగా 'ఎఫ్‌ 2' కు ఎక్కువ మార్కులేసి ఆదరించారు అభిమానులు. 

 

దాంతో వసూళ్ల పరంగా దూసుకెళ్లడమే కాకుండా, అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది 'ఎఫ్‌ 2'. దాంతో దిల్‌రాజు కూడా ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇక నెక్స్ట్‌ దిల్‌రాజు బ్యానర్‌లో రాబోతోంది మహేష్‌బాబు 'మహర్షి' మూవీ. 'ఎఫ్‌ 2' హిట్‌ కొట్టడంతో దిల్‌రాజు 'మహర్షి' మూవీపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా పూజా హెగ్దే నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సమ్మర్‌లో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS