'ఎఫ్ 2'తో ఫామ్ లోకి వచ్చాడు వెంకటేష్. ఇప్పుడు తనలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 'వెంకీ మామ' త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా కొత్త కథలు కూడా సిద్ధం చేసుకుంటున్నాడు వెంకీ. అయితే ప్రస్తుతం వెంకీ కొన్ని ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు. అందులో వెన్ను నొప్పి ఒకటి. గత కొంతకాలంగా వెంకీని వెన్ను నొప్పి...తీవ్రంగా బాధిస్తోంది. అందుకు తగిన చికిత్స ప్రస్తుతం తీసుకుంటున్నాడు.
వెన్ను నొప్పి తగ్గించడంలో ప్రకృతి చికిత్సని ఆశ్రయించాడు వెంకీ. నేచర్ క్యూర్ ఆసుపత్రి (విశాఖ)లో ప్రస్తుతం వెంకీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట. ఈ ఆసుపత్రి ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం ప్రకృతి మూలికలతో రోగాన్ని నయం చేస్తారు. వీళ్ల ఆహార అలవాట్లు కూడా వేరుగా ఉంటాయి. యోగ, ధ్యానమే ఔషధాలుగా పని చేస్తాయి. కనీసం 15రోజుల ట్రీట్మెంట్ అవసరం. వెంకీ తదుపరి సినిమాకి ఇంకాస్త సమయం ఉంది కాబట్టి.. ప్రస్తుతం ప్రకృతి వైద్యంతో సేదతీరుతున్నాడట.