పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అంతెందుకు బాలీవుడ్ హాట్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ కూడా తన దేశభక్తిని చాటేసుకుంది. పాకిస్థాన్‌కి బాంబులతో వెళ్లి ఉగ్రశిబిరాల్ని మట్టు పెట్టి తిరిగొస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన రెస్పాన్స్‌ని తెలియజేసింది. పాకిస్థాన్‌ని ప్రపంచ పటంలో లేకుండా నాశనం చేయాలని స్టేట్‌మెంట్ ఇచ్చింది.
దాడి గురించి తెలిశాక చాలా ఆవేదనకు గురయ్యాననీ, వెంటనే బోర్డర్‌కెళ్లి గన్నులతో టెర్రరిస్ట్‌లను కాల్చి చంపేయ్యాలన్నంత కసి వచ్చేసిందని కంగనా చెప్పింది. సోషల్ మీడియాలో కంగనా రెస్పాన్స్‌కి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి నెటిజన్స్ నుంది. 'అమ్మో కంగనా.. కూసింత ఆగమ్మా. అదేం నువ్వు చేసిన 'మణికర్ణిక' సినిమాలోని గుర్రం ఫైట్లు అనుకుంటున్నావా.? అంటూ పోస్ట్‌లు పెట్టారు.
ఇటీవల 'మణికర్ణిక' మూవీ నుండి కంగనా రనౌత్ బొమ్మ గుర్రంపై స్వారీ చేస్తూ యాక్షన్ సీన్స్‌లో నటిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోను పోస్ట్ చేస్తూ కంగనాని ట్రోల్ చేస్తున్నారు. అయినా కంగనాని తక్కువంచనా వేయకూడదు. కంగనాకి ఉన్న డేరింగ్ అండ్ డాషింగ్‌కి ఏమో బోర్డర్‌కెళ్లి కాల్చేసినా కాల్చేస్తుంది. దటీజ్ ఫైర్ బ్రాండ్ ఆఫ్ కంగనా.