నిన్న 'దోచేసి', నేడు 'దిమ్మాక్‌ ఖరాబ్‌ చేసి'.!

మరిన్ని వార్తలు

'నన్ను దోచుకుందువటే' అంటూ సుధీర్‌ బాబుతో కలిసి క్యూట్‌గా అల్లరి చేసిన నభా నటేష్‌ అలియాస్‌ 'సిరి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌' త్వరలో ఇస్మార్ట్‌ గాళ్‌గా రాబోతున్న సంగతి తెలిసిందే. రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో వన్‌ ఆఫ్‌ ది హీరోయిన్‌గా నభా నటేష్‌ నటిస్తోంది. పూరీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. లేటెస్ట్‌గా ఈ సినిమాలోని ఓ పాట షూటింగ్‌కి సంబంధించి సెట్‌లోని స్టిల్స్‌ బయటకొచ్చాయి.

 

'దిమాక్‌ ఖరాబ్‌..' అంటూ సాగే ఈ పాటను నభా నటేష్‌పై చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్‌లో నభా నటేష్‌ గెటప్‌ నిజంగానే దిమ్మాక్‌ ఖరాబ్‌ చేసేలా ఉంది. మణిశర్మ మ్యూజిక్‌ కంపోజ్‌ చేసిన ఈ సాంగ్‌ తెలంగాణా యాసలో ఉండబోతోందనీ తెలుస్తోంది. ట్రెడిషనల్‌ వేర్‌లో కొంచెం హాట్‌గా కొంచెం క్యూట్‌గా ఫుల్‌ గ్రేస్‌తో కనిపిస్తోంది నభానటేష్‌. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

 

ఇటీవల నిధి అగర్వాల్‌పై చిత్రీకరించిన సాంగ్‌ షూట్‌కి సంబంధించిన స్టిల్స్‌ బయటికి వచ్చాయి. వాటికీ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నభా లేటెస్ట్‌ స్టిల్స్‌కీ రెస్పాన్స్‌ అదిరిపోతోంది. మొత్తంగా 'ఇస్మార్ట్‌ శంకర్‌'ని ఇస్మార్ట్‌ గాళ్స్‌తోనే ఎక్కువగా ప్రమోట్‌ చేస్తున్నాడు పూరీ జగన్నాధ్‌. స్టార్టింగ్‌లో వచ్చిన ఫస్ట్‌లుక్‌ తప్ప రామ్‌కి సంబంధించి మరో గెటప్‌ని రివీల్‌ చేయలేదింతవరకూ. ఈ సినిమాని ఛార్మితో కలిసి పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో పూరీ జగన్నాధ్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS