దేశమంతా ఇప్పుడు భారత్ - పాక్ మధ్య యుద్ధం జరుగుతుందనే ఆందోళనతో ఉంది. గత కొద్ది రోజులగా నెలకొన్న ఉద్రిక్త పరస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. సినీ ప్రముఖులు తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. తాజాగా తమిళ నటుడు కార్తి నటించిన 'చెలియా' సినిమాలో తన పాత్రను గుర్తు చేసుకుంటూ తాజాగా పాకిస్థాన్‌కి చిక్కిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించాడు.
ఇంతకీ 'చెలియా'లో కార్తీ పాత్రకు, అభినందన్‌కీ ఏంటీ సంబంధం.? అంటే అభినందన్ తండ్రి వర్ధమాన్ ఒకప్పటి ఇండియన్ వైమానికదళ వింగ్ ఆఫీసరే. ఆయన కో పైలట్ ఒకరు అప్పట్లో ఇలాగే పాక్ ఆర్మీకి చిక్కి చిత్రహింసలు అనుభవించాడు. ఆ అనుభవాలనే 'చెలియా' డైరెక్టర్ మణిరత్నంకి వివరించగా, ఆ సన్నివేశాల్ని డెవలప్ చేసి కార్తీతో 'చెలియా' సినిమా తెరకెక్కించారు. అలా 'చెలియా' కథకు సహకారమందించిన వర్ధమాన్ కుమారుడు అభినందన్‌కి ఇప్పుడు అదే పరిస్థితి రావడం దురదృష్టకరం.
ఆ పరిస్థితిని రీల్‌లో చూపించడానికే ఎంతో కష్టం అనుభవించాల్సి వచ్చింది. అలాంటిది రియల్‌గా ఎదుర్కోవాలంటే చాలా ధైర్యం కావాలి. అభినందన్ ఇప్పుడు అలాంటి రియల్ సిట్యువేషన్‌లో ఉన్నారు. ఆయన క్షేమంగా ఇండియాకి తిరిగి రావాలని కోరుకుంటూ హీరో కార్తీ అభినందన్ కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కార్తీతో పాటు దేశమంతా ఇదే కోరుకుంటోంది.