తమిళంలో ఘన విజయం సాధించిన `96`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాత. ఆయన బ్యానర్లో పనిచేయడం శర్వాకి ఇది రెండోసారి. ఇద్దరి మధ్య.. మంచి అనుబంధమే ఉంది. అయితే ఓ విషయంలో మాత్రం శర్వా.. దిల్‌రాజుపై అలిగాడట.
96 తెలుగు రీమేక్ కి 'జానకీదేవి', 'జానూ' అనే రెండు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అందులో ఏదో ఒకటి ఖాయం చేసేయడం గ్యారెంటీ. ఈ రెండు టైటిళ్లూ శర్వానంద్‌కి నచ్చలేదట. ఎందుకంటే.. ఏ పేరు పెట్టినా దీన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా భావించే అవకాశం ఉంది. సినిమా కథంతా.. సమంతవైపే నడుస్తుందేమో అనుకుంటారు.
కాబట్టి.. 'వీటికన్నా మంచి టైటిల్ ఉంటే చూడండి' అంటున్నాడట. కానీ.. దిల్‌రాజు వినే టైపు కాదు కదా? ఈ రెండింటికే ఫిక్స్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. టైటిల్ విషయంలోనే ఇలా ఉంటే, సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం ఇస్తారా, లేదా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నాడట శర్వా. మరి ఏం జరుగుతుందో చూడాలి.