ఇంద్రగంటితోనే నాని కల నెరవేరబోతోందా.?

By Inkmantra - March 18, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

హీరోగా నానిని తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహనకృష్ణ. 'అష్టాచెమ్మా' సినిమాతో ఇంద్రగంటి ఈ పక్కింటబ్బాయ్‌ని పరిచయం చేశాడు. ఇప్పుడు నేచురల్‌ స్టార్‌గా తనదైన శైలిలో దూసుకెళ్లిపోతున్నాడు నాని. త్వరలో 'జెర్సీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నాని. తర్వాత 'గ్యాంగ్‌లీడర్‌' అంటూ సందడి చేయనున్నాడు. ఇక తదుపరి నాని చేయబోయే సినిమా ఇంద్రగంటి డైరెక్షన్‌లోనే ఉండబోతోందని ఈ మధ్య ప్రచారం జరిగింది. 

 

అవును నిజమే ఇంద్రగంటి తెరకెక్కించబోయే ఓ వినూత్న సినిమాలో నాని విలన్‌గా నటిస్తున్నాడనీ తెలుస్తోంది. సుధీర్‌బాబు ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించబోతున్నాడు. హీరోయిన్లుగా నివేదా థామస్‌, అదితీ రావ్‌ హైదరీ పేర్లు పరిశీలిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఇద్దరూ ఇంద్రగంటి గత చిత్రాల్లో నటించినవారే కావడం విశేషం. కాగా ఈ సినిమాలో నాని విలన్‌ పాత్ర ప్రత్యేకతను సంతరించుకోదగ్గదట. 

 

నేచురల్‌ స్టార్‌గా ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న నానికి విలన్‌గా నటించాలన్నది డ్రీమ్‌ అని గతంలో పలు మార్లు చెప్పాడు. ఆ కల మళ్లీ తన మొదటి సినిమా డైరెక్టర్‌తోనే నెరవేరబోతోందన్నమాట. ఈ సినిమాలో రెండు వేరియేషన్స్‌ ఉన్న పాత్రల్లో నాని కనిపించబోతున్నాడట. అందులో ఒకటి పూర్తిగా నెగిటివ్‌ రోల్‌ అని తెలుస్తోంది. అంటే నాని కల ఇలా తీరుతోందన్న మాట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS