బాలయ్యతో పోటీకి దిగుతోన్న నయనతార.!

మరిన్ని వార్తలు

అదేంటీ.! బాలయ్యతో నయనతారకు పోటీ ఏంటబ్బా.. అనుకుంటున్నారా.? అవునండీ నిజంగానే బాలయ్యతో నయనతార పోటీ పడుతోంది. ఈ నెల 22న బాలయ్య నటిస్తున్న 'మహానాయకుడు' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు నయనతార నటించిన తమిళ మూవీ 'అంజలి సీబీఐ' టైటిల్‌తో తెలుగులోకి డబ్‌ అవుతోంది. అయితే నిజానికి బాలయ్యతో నయనతారకు పోటీ ఎంతమాత్రమూ లేదు. 

 

కానీ ఇటీవల నయనతారకు క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. నయన్‌ నటించిన హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీలు తెలుగులో డబ్‌ అయ్యి మంచి విజయాలు అందుకుంటున్నాయి. ఇక బాలయ్య విషయానికి వస్తే, 'కథానాయకుడు' ఎఫెక్ట్‌తో 'మహానాయకుడు' ని ఎవ్వరూ నమ్మడం లేదు. సో నయనతార సినిమాకి ఏమాత్రం పోజిటివ్‌ టాక్‌ వచ్చినా ఇక అంతే సంగతి. బాలయ్య వెనక్కి వెళ్లిపోవాల్సిందే. అయితే ఈ నెల్లో విడుదలైన డబ్బింగ్‌ సినిమాలు అంతగా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. 

 

కార్తి నటించిన 'దేవ్‌', విడుదలకు ముందే సెన్సేషన్‌ అయ్యి హైప్‌ క్రియేట్‌ చేసిన 'లవర్స్‌డే' మూవీలు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఈ తరుణంలో సౌత్‌క్వీన్‌ నయనతార 'అంజలి సీబీఐ' ఏ రేంజ్‌లో తెలుగునాట పట్టు సాధిస్తుందో చూడాలి మరి. ఇదిలా ఉంటే, బాలయ్య 'కథానాయకుడు'కి పోటీగా ఈ ఏడాది జనవరిలో 'పేటా' విడుదలైంది. 'కథానాయకుడు'తో పోల్చితే 'పేటా' బెటర్‌ అనిపించుకుంది. మరోసారి నయన్‌ డబ్బింగ్‌ సినిమా దెబ్బకి 'మహానాయకుడు' అబ్బా అంటాడా.? చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS