లక్ష్మీరాయ్‌ చాలా మంచి దెయ్యమట.!

మరిన్ని వార్తలు

బికినీలతో పిచ్చెక్కించేసిన రత్తాలు ఇప్పుడు దెయ్యంగా కనిపించి స్పెషల్‌ కిక్‌ ఇవ్వబోతోంది. లక్ష్మీరాయ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా 'వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి' త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈ సినిమాలో లక్ష్మీరాయ్‌తో పాటు కమెడియన్స్‌ మధునందన్‌, ప్రవీణ్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో లక్ష్మీరాయ్‌ ఫన్నీ దెయ్యంగా కనిపించనుందట. 

 

ఓ మామూలు స్త్రీగా తన సంకల్పం నెరవేర్చుకునే నిమిత్తం ప్రవీణ్‌, మధునందన్‌ల పంచన చేరిన వెంకటలక్ష్మి దెయ్యంగా వారికి షాక్‌ ఇచ్చే సన్నివేశాలు ఫన్నీగా ఉంటాయట. దెయ్యం అని తెలిసిన తర్వాత లక్ష్మీరాయ్‌ విన్యాసాలు కడుపుబ్బా నవ్విస్తాయట. ప్రవీణ్‌, మధునందన్‌ల భయం నుండి పుట్టే పర్‌ఫామెన్స్‌ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ అందమైన దెయ్యం కారణంగా వారు పడే తిప్పలు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయట. 

 

కానీ విలన్స్‌ విషయంలో మాత్రం దెయ్యం ఉగ్రరూపం చూపిస్తుందట. ఓవరాల్‌గా ఈ వెంకటలక్ష్మి చాలా మంచి దెయ్యమనీ ప్రచారం జరుగుతోంది. తెలుగు తెరపై సరికొత్త దెయ్యం కథతో ఈ సినిమాని రూపొందించారు. కమెడియన్లుగా అలరించిన మధునందన్‌, ప్రవీణ్‌ల కెరీర్‌లో 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' ఓ మంచి పర్‌ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ మూవీగా నిలుస్తుందంటున్నారు. ఈ శుక్రవారం భయపెడుతూ, నవ్వించేందుకు 'వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి' ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS