కిర్రాక్‌ లుక్‌లో 'కామ్రేడ్‌' పాప.!

మరిన్ని వార్తలు

కన్నడ మూవీ 'కిర్రిక్‌ పార్టీ'తో కన్నడతో పాటు, తెలుగు ప్రేక్షకుల్నీ ఎట్రాక్ట్‌ చేసిన బ్యూటీ రష్మికా మండన్నా. తొలి సినిమా 'ఛలో'తో హిట్‌ కొట్టి క్రేజీ హీరోయిన్‌ అయిపోయింది. ఇక 'గీత గోవిందం' సినిమాతో కుర్రాళ్లకు ఆరాధ్యదేవతగా మారిపోయింది. ఇక ఇప్పుడు 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంతో రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లో సెన్సేషనల్‌ ముద్దుల హీరో విజయ్‌ దేవరకొండతో చిటపట చినుకుల్లో వేడి వేడిగా లిప్‌లాక్‌ లాగించేసింది. ఈ లిప్‌లాక్‌తో సినిమాపై అంతవరకూ ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. 

 

ఇక లేటెస్ట్‌గా అమ్మడి బర్త్‌డే సందర్భంగా 'డియర్‌ కామ్రేడ్‌' సినిమా నుండి రష్మికా మండన్నా లుక్‌ని రిలీజ్‌ చేశారు. ఈ లుక్‌లో బర్త్‌డే బేబీ సీరియస్‌గా కనిపిస్తోంది. చేతుల నిండా చక్కగా గోరింటాకు పెట్టుకుంది. కానీ చేతిలో బ్యాట్‌ పట్టుకుంది. మరి ఎవరిపై కోపమో. లుక్‌లో సీరియస్‌గా ఉంది. కానీ సినిమాలో చాలా నవ్విస్తుందట రష్మికా. బర్త్‌డే సందర్భంగా రష్మికాకి సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ పోటెత్తుతున్నాయి. 

 

రష్మికతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న హీరోలు విజయ్‌ దేవరకొండ, నితిన్‌ ప్రత్యేకంగా హ్యాపీ బర్త్‌డే లిల్లీ అంటూ విషెస్‌ తెలియజేయగా, సోషల్‌ మీడియాలో అభిమానులు తమ తమ శైలిలో రష్మికకు బర్త్‌డే విషెస్‌ చెబుతున్నారు. 'డియర్‌ కామ్రేడ్‌' సినిమాతో పాటు, రష్మికా నితిన్‌తో 'భీష్మ' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో యంగ్‌ హీరో కార్తితో ఓ సినిమాలో నటిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS