బాబోయ్‌ వర్మ 'జీఎస్టీ'లో ఇవన్నీ ఉంటాయా?

By iQlik Movies - January 12, 2018 - 05:14 PM IST

మరిన్ని వార్తలు

పోర్న్‌ రంగం నుండి వచ్చి బాలీవుడ్‌ తెరపై హీరోయిన్‌గా కొనసాగుతున్న ముద్దుగుమ్మ సన్నీలియోన్‌. అలాగే తాజాగా మరో పోర్న్‌ స్టార్‌ మియా మల్కోవా ఇండియన్‌ తెరపై తన హాట్‌ హాట్‌ అందాలారబోయడానికి సిద్ధమైపోతోంది. సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఈ పోర్న్‌ స్టార్‌ని ఇండియన్‌ స్క్రీన్‌కి పరిచయం చేస్తున్నాడు. తాజాగా వర్మ 'గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌' టైటిల్‌తో ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమా కోసమే మియా మల్కోవా పోర్న్‌ రంగం నుండి ఇండియన్‌ సినిమా వైపు తన కాన్‌సన్‌ట్రేషన్‌ మార్చుకుంటోంది. ఈ సినిమా ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. మియా మల్కోవా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న ఫోటోలు సంచలనాలకు దారి తీస్తున్నాయి. వర్మ సినిమాలోని ఫోటోలివి అంటూ ఈ హాట్‌ స్టార్‌, న్యూడ్‌గా ఉన్న ఫోటోలను ఒక్కొక్కటిగా షేర్‌ చేస్తోంది. దాంతో ఈ సినిమాలో వర్మ ఏం చూపించబోతున్నాడో అంటూ సర్వత్రా ఆశక్తి నెలకొంది. అసలు వర్మ నిజంగానే ఈ చిత్రాన్ని ఇంత న్యూడ్‌గా తెరకెక్కిస్తున్నాడా? ఒకవేళ అలాగే తెరకెక్కిస్తే, ఈ సినిమా సెన్సార్‌ని దాటి బయటికి వస్తుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 

ఎందుకంటే ఇండియాలో న్యూడ్‌ సినిమాలకు అనుమతి లేదు. గతంలో షకీలా తదితర అడల్ట్‌ మూవీస్‌ వచ్చినప్పటికీ, వాటిలో అనధికారంగా న్యూడ్‌ సీన్స్‌ యాడ్‌ చేసేవారు కానీ, ఇండియాలో అస్సలు ఇంతవరకూ అలాంటి సినిమాలు తెరకెక్కిన సందర్భాలు లేవు. పోర్న్‌ రంగం నుండి వచ్చిన సన్నీలియోన్‌ బాలీవుడ్‌ తెరపై హీరోయిన్‌గా, ఐటెం గాళ్‌గా కొనసాగుతున్నప్పటికీ, న్యూడ్‌గా ఇంతవరకూ ఎక్కడా నటించలేదు. చూడాలి మరి వర్మ ఈ సినిమాతో ఏం చేస్తాడో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now